- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ బాస్ స్కెచ్‌లో మజ్లిస్! చెక్ పెట్టడమే టార్గెటా?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతు తెలపడం వెనుక గులాబీ బాస్ వ్యూహం ఏంటనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మజ్లీస్ కంటే తమకు తక్కువ బలం ఉండటం వల్లే ఆపార్టీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందనే కారణం వినిపిస్తున్నప్పటికీ అసలు రీజన్ మరొకటి ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
విస్తరణకు చెక్ పెట్టడమే టార్గెటా?
తెలంగాణ ఏర్పాటు అయ్యాక 2014 నుంచి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా కొనసాగుతోంది. బేషరతుగా మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. కేటీఆర్ మాటలతో విజృంభించిన అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని కచ్చితంగా 15 స్థానాల్లో గెలిచి అసెంబ్లీకి వస్తామని ఛాలెంజ్ చేశారు.
దీంతో బీఆర్ఎస్‌కు ఎంఐఎంకు చెడిందనే ప్రచారం జోరుగా వినిపించింది. ఇంతలోనే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రావడం ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా వెళ్లి కేటీఆర్‌ను కలవడం ఆ తర్వాత కేసీఆర్ ఎంఐఎంకే మద్దతు ప్రకటించడం జరిగిపోయింది. అయితే ఈ ఎన్నికలో మజ్లిస్‌కు మద్దతు వెనుక కేసీఆర్ భారీ వ్యూహం వేశారని రాష్ట్రంలో విస్తరించాలన్న మజ్లిస్ కోరికను ఇన్‌డైరెక్ట్‌గా చెక్ పెట్టడమే దీని వెనుక వ్యూహం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కలిసి వచ్చే అంశాలపై ఫోకస్!
నిజానికి తమ పార్టీని విస్తరిచే విషయంలో ఒవైసీ బ్రదర్స్ గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్‌ను అసద్దుదీన్ ప్రకటించారు. ఇతను 2018లో రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం తరపున పోటీ చేసి 18 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. దీంతో రహమత్ బేగ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో అక్కడ ఎంఐఎం గట్టి నాయకత్వాన్ని కోల్పోయినట్లే అనే చర్చ జరుగుతోంది.
దీంతో ఇది బీఆర్ఎస్‌కు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సర్వేల పేరుతో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించిన గులాబీ బాస్ విపక్షాలను కట్టడి చేయడానికి పక్కా స్కెచ్ వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్ వంటి స్థానాల నుంచి ఎంఐఎం పోటీ చేసి గెలవాలని తహతహలాడుతోందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లీస్‌కు గులాబీ పార్టీ మద్దతు ఉత్కంఠగా మారుతోంది.