- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై మైనంపల్లి హన్మంతరావు క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమాల మీదనే నా పోరాటం ఉంటుందని కీలక ప్రకటన చేశారు. నన్ను మేనేజ్ చేసేందుకు హైకమాండ్‌తో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కేవలం తాను విద్యార్థులకు మద్దతు ప్రకటించేందుకు మాత్రమే వెళ్లానని అన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కాలేజీలను కూల్చేవరకు పోరాటం ఉంటుందని వెల్లడించారు. కాగా, మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన అన్యాయంగా తమను డిటైండ్ చేసి.. తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కోర్సు చేస్తున్న విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమను కావాలనే డిటైండ్ చేసి తృతీయ సంవత్సరంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న మైనంపల్లి.. అక్కడకు చేరుకొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.