- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక రహస్యమిదే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిశ, వెబ్డెస్క్: తనతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ అంటున్నాడని కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు వరకు సీఎం రేవంత్ ఉంటాడో లేదో తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని అన్నారు.. మరీ ఆ 20 మందిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారేమోనని మహేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మడం లేదని.. అందుకే దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తామంటున్నారు సరే.. ఆరు గ్యారెంటీల్లోని మిగతా హామీల సంగతేంటని ప్రశ్నించారు. మిగతా హామీల కోసం ఎంతమంది దేవుళ్ల మీద ఒట్లు వేస్తారని సెటైర్ వేశారు. హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.