- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJYM: నిరుద్యోగులంతా కాంగ్రెస్‌కు ఘోరీ కట్టడం ఖాయం: మహేందర్
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల భవిష్యత్‌ను తాకట్టు పెట్టాడని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ విమర్శలు చేశారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటాలు చేస్తోందని, కానీ తమ పోరాటాన్ని నీరుగార్చేలా కార్యకర్తలను, నిరుద్యోగులను ప్రభుత్వం ఆరెస్ట్ చేస్తోందని ధ్వజమెత్తారు. ని
రుద్యోగులకు న్యాయం చేయమని కోరితే లాఠీలతో కొట్టించారని మహేందర్ ఫైరయ్యారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకున్నా, ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా నిరుద్యోగులు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరీ కట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరుద్యోగుల తరఫున ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.
దొర పాలన పోయి.. దొంగల రాజ్యం వచ్చింది: కాసం వెంకటేశ్వర్లు
తెలంగాణలో పదేళ్ల పాటు దొరల పాలన కొనసాగిందని, ఇప్పుడు దొంగల రాజ్యం వచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో మరో పార్టీ అధికారంలోకి వచ్చిందని, 8 నెలల కాంగ్రెస్ పాలన తిరగముందే నిరుద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ బార్స్ ఓపెన్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లుగా పరిస్థితి మారిందన్నారు.
కాంగ్రెస్‌ది.. ప్రజాపాలన అయితే నిర్భంధాలెందుకని కాసం ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌పై కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని కాసం మండిపడ్డారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వాలన్నారు. ఇకపోతే బీఆర్ఎస్ నాయకులు ఎక్స పైరీ మెడిసిన్ తో సమానమని కాసం ఎద్దేవాచేశారు.
Read More..