- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలు వస్తేనే KCR వస్తారు..YS Sharmila
దిశ, అచ్చంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలమూరు రంగారెడ్డి పై చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో నూతన బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై సభలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి పై సీఎం కేసీఆర్‌కు లేదని ఎందుకంటే కాలేశ్వరం ప్రాజెక్టులో సుమారు 150 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్‌కు ఏమి రావు కనుక పట్టించుకోవడం లేదని మండిపడుతూ ఈ జిల్లాలో పాదయాత్ర కొనసాగినంత దూరం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ కొనసాగిస్తామని తెలిపారు.
పేదల ఆరోగ్యం కోసం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో పేదవాడికి వైద్య సేవలు మరింత అందుబాటులోకి తెచ్చేలా 108, 104 లాంటి పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆనాడు వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు 65 లక్షల పక్కా గృహాలు మంజూరు చేశాడని.. నేడు కేసీఆర్ తాను చెప్పిన విధంగా డబుల్ బెడ్ రూమ్ ఎక్కడ ఇవ్వలేదని మండిపడ్డారు.
ఎన్నికలు వస్తేనే ఆయన వస్తాడు..
అచ్చంపేట ప్రాంతానికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారు. ఆయన ఈ ప్రాంతం పైన ప్రేమ లేదని కేవలం ఎన్నికలు వస్తేనే వస్తాడని విమర్శించారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అచ్చంపేట పట్టణానికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశాడని, దానిని ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించ లేకపోయిందని ఎద్దేవా చేశారు.
నక్కలు ఎరుగని గుంటలు లేవు.. పామూరు ఎరగని పుట్టలు లేవు.. అలాగే కేసీఆర్ చేసిన పాపాలు అంతా ఇంతా కాదని ద్వజమెత్తారు. దళితుల మూడెకరాలు ఇచ్చాడా..? దళితుడిని సీఎం చేశాడా..? మైనార్టీలకు రిజర్వేషన్ 12 శాతం కల్పించాడా..? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అమలు చేశాడా..? ఏ ఒక్కటి చేయకుండా ప్రజలను మోసం చేస్తూ.. ప్రతి దాంట్లో అవినీతి తాండవిస్తుందని ఆరోపించారు.
ఎవడబ్బ సొమ్మని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి దానం చేస్తావని రాష్ట్రంలో ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక రైతునైనా పరామర్శించావా..? అత్త సొమ్ము అల్లుడు దానం చేసే విధంగా ఉందని ప్రతి బిడ్డ మీద నాలుగు లక్షల అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని విమర్శించారు.
ఉమామహేశ్వర చెన్నకేశవ ప్రాజెక్టులు ఎక్కడ..
ఆనాడు వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షలు, బీమా ప్రాజెక్టు ద్వారా మూడు లక్షలు, నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే కేవలం 10 శాతం మిగిలిపోయిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఇప్పటివరకు ఈ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని మండిపడ్డారు.
అలాగే అచ్చంపేట శాసనసభ్యులు పువ్వుల రాజా.. గువ్వల బాలరాజ్ అంటూ సంబోధిస్తూ.. ఉమామహేశ్వర చెన్నకేశవ ప్రాజెక్టులు ప్రశ్నించారు. అలాగే ఈ శాసనసభ్యులు ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పోలీసులను సైతం అసభ్యకరంగా మాట్లాడడం ఒక దాదా మాదిరిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఓటు విలువైందని దాన్ని అమ్ముకోవద్దని మీ గుండెల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు గా మీ ముందుకు వచ్చానని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Also Read : KCR ప్లాన్-బీ.. ఆసక్తి రేపుతోన్న Prashant Kishor (ప్రశాంత్ కిషోర్) కామెంట్స్