యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ జానకి

by Aamani |
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి :  ఎస్పీ జానకి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు.మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి,కల్తీ కల్లు నిర్మూలన గోడ పత్రికను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా,సమాజపరంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు.

ఎవరైనా గంజాయి విక్రయం,కల్తీ కల్లు తయారీ,సరఫరా,వినియోగానికి పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని,అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు.జిల్లాలో ఈ ప్రచారాన్ని మరింత బలపరచడానికి రద్దీ ప్రదేశాల్లో,స్కూళ్ళు,కాలేజి స్థాయిలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని ఆమె సూచించారు.మత్తు పదార్థాల వినియోగ వ్యసనాన్ని నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య,డీసీఆర్బీ డిఎస్పీ రమణారెడ్డి,తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed