ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

by samatah |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
X

దిశ,అడ్డాకుల : మండలం శాఖాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.గ్రామానికి చెందిన G కురుమూర్తి యాదవ్ (37) , D మోహన్ రెడ్డి (35) లు ఆదివారం సాయంత్రం గద్వాల్‌లో ఉన్న స్నేహితుడిని కలవడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జమ్మిచెడ్ సమీపంలో వారి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టీఎస్ 11 ఈటి 6491 నెంబర్ గల కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ

సుపత్రి లోనే మోహన్ రెడ్డి మృతి చెందగా, కురుమూర్తి యాదవ్‌ను కర్నూల్ కు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీనితో సోమవారం శాఖాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. కురుమూర్తి యాదవ్ IIFL గోల్డ్ లోన్ కంపెనీ‌లో జోనల్ మేనేజర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు.అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మోహన్ రెడ్డి కి ఏడాది క్రితం వివాహం కాగా రెండు నెలల క్రితమే కూతురు పుట్టింది. ప్రస్తుతం మోహన్ రెడ్డి మృతదేహం గద్వాల ఆస్పతిలో, కురుమూర్తి మృతదేహం మహబూబ్ నగర్ ఆసుపత్రి లో ఉన్నట్లు సమాచారం.

MLA సంతాపం

శాఖాపూర్ గ్రామానికి చెందిన యువకులు మృతిచెందిన ఉదంతం పై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అడ్డాకుల ZPTC రాజశేఖర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారు ఈ మేరకు స్థానిక సర్పంచ్ జయన్న గౌడ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకొని సంఘటనపై విచారం వ్యక్తపరిచారు.

Advertisement

Next Story