- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజకవర్గాలకు... దిక్కెవరు...?
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నాయి.. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న నాయకులు ఒకరిని మించి మరొకరు కార్యక్రమాలు నిర్వహిస్తూ... ప్రజల్లోకి వెళుతున్నారు. వారిలో వారికి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ బలోపేతానికి .. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతలను ఢీకొట్టేంత స్థాయి లేకపోయినా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో మాత్రం తమ వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. కానీ రెండు నియోజకవర్గాలలో మాత్రం పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపించే నాయకుడు లేక... శ్రేణులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు.
నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి .. ఈ నియోజకవర్గాలలో నాయకత్వం వహించి పార్టీని ముందుకు నడిపించవలసిన నేతలు నియోజకవర్గాలలో పర్యటించేందుకు సమయం కేటాయించకపోవడం. ఇతరులకు అవకాశం ఇవ్వక పోవడంతో కార్యక్రమాలు నామమాత్రంగా సాగుతున్నాయి... ఆ కార్యక్రమాలను సైతం మండలాలకు చెందిన నాయకులే ముందుకు తీసుకెళుతున్నారు. నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయవలసిన నేతల్లో ఒకరు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి... వచ్చి వెళుతుండగా... మరొకరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తా. మన సత్తా ఏంటో చూపిస్తాడు. అలా చెప్పిన నాయకుడు పట్టుమని మూడు రోజులు నియోజకవర్గంలో తిరిగాడో లేదో... అంతలోనే మళ్లీ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు.
ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండగా.. మరోవైపు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లి.. ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార పార్టీ నేతలను నిలదీయలేక.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయలేక... కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ చత్తికిలో పడుతోంది.. ఆ రెండు నియోజకవర్గాలలో ఆ ఇద్దరు నాయకులు తప్ప మరి ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లలేరు అన్న చందంగా అధిష్టానం ఆ నియోజకవర్గాలపై దృష్టి సారించలేకపోతోంది... దీంతో తమ పార్టీ పరిస్థితులను చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కొందరు ఇతర పార్టీలలో చేరిపోగా.. మరికొందరు ఏ పార్టీలలోకి వెళ్ళలేక తమలో తాము కుమిలిపోతున్నారు.
ఒకరు ఢిల్లీలో... మరొకరు అజ్ఞాతవాసంలో..!!
కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకుని ముందుకు తీసుకు వెళ్ళవలసిన చల్లా వంశీ చందర్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ పార్టీ కార్యక్రమాల బాధ్యతల నిర్వహణలో బిజీగా ఉంటున్నారు.. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.. బంధువుల ఇండ్లలో జరిగే కార్యక్రమాలకు వంశీ హాజరు అవుతున్నారు.. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టి కార్యక్రమాలకు నామమాత్రంగా హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్న.. వంశీ చందర్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించుకొని టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తే... తమకు అవకాశం రాదు అని వెనుకంజ వేస్తున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న వంశీ చందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను కల్వకుర్తి నుంచి పోటీ చేస్తాను ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ముఖ్య నాయకులతో చెప్పినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వచ్చి పార్టీ కార్యక్రమాలను చేపడితే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో చెప్పలేమని సొంత పార్టీ నాయకులే సందేహాలను గుర్తించవలసిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. నారాయణపేట నియోజకవర్గం లో పార్టీ పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయి. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శివ కుమార్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన కొన్ని నెలల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.
శివ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో అతనికి సంబంధించిన అశ్లీల ఫోటోలను అధికార పార్టీ సోషల్ మీడియా వారు వైరల్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యనే తిరిగి వచ్చిన శివ కుమార్ రెడ్డి... ఇక చూసుకుందాం. నియోజకవర్గ ప్రజలకు... పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటాను అని చెప్పారు. కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది... కానీ అంతలోనే... మళ్లీ ఏమైందో కానీ కుంభం శివ కుమార్ రెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అధీస్టానం దృష్టి సారించాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఈ నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ యాత్ర వంటి కార్యక్రమాలు పెద్దగా సాగడం లేదు... ఈ కారణంగా పార్టీ అధిష్టానం చొరవ చూపి కార్యక్రమాలను నిర్వహించగల సత్తా నాయకులకు బాధ్యత అప్పగించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులోకి వస్తారు అనుకుంటే శివకుమార్ రెడ్డి, వంశీధర్ రెడ్డి కి గాని .. లేదా ఇతరులకు గాని బాధ్యతలు అప్పగించి నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.