నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన జాలర్లు..చివరికి ఏమైందంటే..?

by Naveena |
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన జాలర్లు..చివరికి ఏమైందంటే..?
X

దిశ, కొల్లాపూర్ : చేపల వేట కోసం వచ్చిన ఇద్దరు జాలర్లు వాగు నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు. గ్రామస్తులు సమయస్ఫూర్తితో వ్యవహారించి చేపలవల,నిచ్చెన సహాయంతో సదరు జాలర్లను ఒడ్డుకు చేర్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లో (ఎగువన )భారీ వర్షాల కారణంగా.. నార్లాపూర్_ముక్కీడిగుండం మధ్య ఎర్ర గట్టు పెద్ద వాగు పొంగిపొర్లుతుంది. కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఇద్దరు జాలర్లు చేపల వేట కోసం ఉదృతంగా పొంగి ప్రవహిస్తున్న ఎర్రగట్టు పెద్దవాగును శనివారం మధ్యాహ్నం దాటేందుకు ప్రయత్నించారు. అయితే ఎగువ నుంచి నీటి ఉధృతి పెరగడంతో.. నీటి ప్రవాహానికి సదరు జాలర్లు కొంత దూరం కొట్టుకుపోయారు. ఈ సంఘటనను చూస్తున్న ముక్కిడి గుండం గ్రామస్తులు కొందరు చేపల వల,నిచ్చెన సహాయంతో ..సమయస్ఫూర్తితో వ్యవహరించి కుడికిల్ల గ్రామం చెందిన సదరు జాలర్లను వరద ప్రవాహం నుంచి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రాణాలతో జాలర్లు బయటపడటంతో.. వారి కుటుంబాల్లో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఇది ఇలా ఉండగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు చేపల వేట కోసం జాలర్లు మత్స్యకారులు నీటి ప్రవాహంలోకి వెళ్తే ప్రాణాలకు ప్రమాదం లేకపోలేదని ముక్కిడి గుండం గ్రామస్తులు సూచిస్తున్నారు. ఏదైనప్పటికీ ముక్కిడిగుండం గ్రామస్తులు సమయస్ఫూర్తితో.. వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను కాపాడినందుకు జాలర్ల కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story