- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలి: ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి
దిశ, ప్రతినిధి నారాయణపేట: బంగారు తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నారాయణపేట సింగారం చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఎగరవేసి తెలంగాణ తల్లికి అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ గడిచిన 20 ఏళ్ల పాలనను నాలుగేళ్ల పాలనతో పోల్చినప్పుడే మనం అభివృద్ధిలో ముందున్నామని తెలుస్తుందని, నాలుగేళ్ల పాలన కాలంలో రెండేళ్లు కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా కరోనా కష్టకాలంలో కూడా కన్నెత్తి చూడని వాళ్ళు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త రవీందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ, వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టాడ్ తోపాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.