- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bima Canal : బీమా కాలువకు తక్షణమే సాగునీరు అందిస్తాం.. ఈఈ కేశవరావు
దిశ, వీపనగండ్ల : బీమా కాలువల ద్వారా పంట పొలాలకు తక్షణమే సాగునీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలని కల్వరాల వీపనగండ్ల సంగినేనిపల్లి తూముకుంట గ్రామాలకు చెందిన రైతులు కోరారు. మండలంలో వరినాట్లు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్నా ఇప్పటికీ బీమా కాలువలకు అధికారులు సాగునీటిని వదలకపోవటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను కల్వరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చక్ర వెంకటేష్, వెంకట్రాజయ్య, రమేష్ గౌడులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు.
జూరాల రిజర్వాయర్ నుంచి నీటిని వదిలిన అధికారులు, బీమా కాలువకు నీటిని వదలటంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కాల్వరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీమా పేస్ 1 నుండి డి 23 కాల్వకు సాగునీటిని వదిలి రైతుల కష్టాలను తీర్చాలని మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత బీమా అధికారులు ఈఈ కేశవరావు, డీఈ కిరణ్ కుమార్, ఏఈ దేవరాజులు గురువారం ఉదయం కల్వరాల సమీపంలోని డీ 23 బీమ కాల్వను పరిశీలించారు. బీమా పేస్ 1 నుండి డీ 23 కల్వకు సాగునీటిని వదిలి 15 రోజులు కావస్తుందని, బుసిరెడ్డిపల్లి పుల్గర్జర్ల శివారులో కాలువలో ఒకచోట రాళ్లు, జమ్మూ పెరకపోవటంతో సాగునీరు ముందుకు వెళ్లడం లేదని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు.
వీపనగండ్ల సంగినేనిపల్లి, తూముకుంట గ్రామాలకు సాగునీరు రాక రైతులు పొలం పనులు మొదలు కాలేదని అధికారులకు వివరించారు. రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీ 23కి నీటిని అందిస్తామని రైతులకు ఈఈ కేశవరావు తెలిపారు. బీమా పేస్ వన్ నుంచి రెండు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నామని. డీ 23 ద్వారా సాగునీరు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని అధికారులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు అఖిల్, తిరుపతయ్య, ఎల్ల స్వామి, రామచంద్ర, వడ్డే నరసింహ, చిన్న వెంకటయ్య, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.