- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ఎంపీటీసీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఎంపీటీసీల ప్రధాన డిమాండ్ అయిన నిధులు, విధులు, ఆత్మగౌరవం తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ఎంపీటీసీ సంఘం ఫోరం అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలులో భాగంగా మూడు నెలల్లోనే 5 అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, మాకున్న సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమై తమకున్న సమస్యలను విన్నవించామని అన్నారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం జరిగిందని, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, మీడియా ఇంచార్జ్ సీజె బెనహర్, దేవ రవీందర్, ప్రతాప్ ఉమ్మడి జిల్లా ఎంపీటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.