- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి కోసం కంకణబద్ధులమై ఉంటాం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి కలెక్టరేట్: జిల్లా కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కంకణ బద్దులమై ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి న్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలో 30వ వార్డు జంగిడిపురం నుంచి ఎస్టీ బాలుర వసతి గృహం వరకు రూ. 2 కోట్ల 10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రం అతి వేగంగా విస్తరిస్తోందని ఈరోజు ఉన్న కాలనీకి మరో ఆరు నెలల తర్వాత వస్తేగుర్తుపట్టలేనంతగా మార్పులు కనిపిస్తున్నాయని దానికి తగినట్లుగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థులు, మహిళలు, యువకులు మంత్రి నిరంజన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి పూలబొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వార్డు కౌన్సిలర్లు బండారు కృష్ణ, కంచె రవి నాయకులు గోపాల్ యాదవ్, వినోద్ గౌడ్ కాలనీవాసులు కురుమయ, రఘునాథరెడ్డి, మద్దిలేటి, రామిరెడ్డి, కృష్ణయ్య, కొండన్న, శేఖర్, సురేందర్ గౌడ్, గోపాల్ నాయక్, కృష్ణా నాయక్, మహేష్, మధుసూదన్ రావు, సురేష్, శేఖర్ రెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Also Read: నెక్ట్స్ సీఎం ఎవరో ముందే చెప్పేసిన మంత్రి కేటీఆర్