పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..

by Sumithra |
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయిస్తుండడంతో పోలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. జిల్లాలోని నాగర్ కర్నూల్ లో 57.32%, అచ్చంపేటలో 55.60 శాతం, కొల్లాపూర్లో 59.69 శాతం, మొత్తంగా 57.42% పోలింగ్ నమోదయింది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక్కో ఓటు నమోదు ప్రక్రియ సుమారు 20 నుండి 30 సెకండ్లు సమయం పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.

మరోపక్క యువత పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తుండడంతో ఈ సారి ఓటు నమోదు శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో గంటల తరబడి ఈవీఎం మిషన్లు మోరాయిస్తుండడంతో ఓటర్లంతా పడిగాపులు కాస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద కూర్చున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఓటర్లు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు గంటల తరబడి వేచి చూస్తూ సమయం కూడా దాటిపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోల వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed