పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు.. కారణం అదే..

by Sumithra |   ( Updated:2023-06-16 09:53:21.0  )
పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు.. కారణం అదే..
X

దిశ, మల్దకల్ : మండలం శేషంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠశాలకు సక్రమంగా రాకపోవడం వల్ల విద్యార్థులకు చదువు సరిగ్గా రావడంలేదని గ్రామస్తులు, సర్పంచు కలసి ఏకంగా ప్రాథమిక పాఠశాలకే తాళం వేశారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఉపాధ్యాయురాలిని నియమిస్తే వారు చదువు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తారా అంటూ సర్పంచు ఉపాధ్యయురాలి పై మండిపడ్డారు. ఈ ఉపాధ్యాయురాలను తొలగించి ఆమె స్థానంలో మరో ఉపాధ్యాయులను నియమించి తమ పిల్లలకు మరుగైన విద్యను అందించేలా చూడాలని విద్యార్థుల తల్లితండ్రులు విద్యా శాఖకు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed