బురదలో ఇరుక్కుంటున్న వాహనాలు.. రాకపోకలకు అంతరాయం

by Nagam Mallesh |
బురదలో ఇరుక్కుంటున్న వాహనాలు.. రాకపోకలకు అంతరాయం
X

దిశ, నాగర్ కర్నూల్ : గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నల్లవాగు నుంచి లింగసానిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై కొత్తగా బ్రిడ్జి నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా బ్రిడ్జి అటువైపు ఇటువైపు మట్టితో చదును చేసి వదిలేసారు. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా వర్షానికి ఆ మట్టి తడిసి వాహనాలు అందులో ఇరుక్కుపోతున్నాయని లింగసానిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చిందంటే ఆ ఊర్లో నుంచి వివిధ పనుల నిమిత్తం నాగర్ కర్నూల్ కు వెళ్లాలంటే బురదలో వాహనాలు వెళ్లడం లేదని దింతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బుధవారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుని బయటకు రాలేక లోపలికి వెళ్లలేక ముప్పు తిప్పలు పడ్డారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇవాళ ఉదయం నాగర్ కర్నూల్ నుంచి కారుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న భారీ వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు ఆ బురదలో ఇరుక్కుపోయింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో బస్సు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జిపై రోడ్డు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు పనులు మధ్యలో వదిలేయడంతో ఆర్ అండ్ బీ అధికారులపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed