కాక రేపుతున్న వనపర్తి రాజకీయాలు..

by Sumithra |
కాక రేపుతున్న వనపర్తి రాజకీయాలు..
X

దిశ, గోపాల్పేట : వనపర్తిలో రాజకీయాలు రోజురోజుకు పుండు మీద కారం చల్లిన విధంగా భగ్గుమంటున్నాయి. నువ్వా నేనా సై అంటే సై అనే విధంగా అటు మెగారెడ్డి ఇటు చిన్నారెడ్డి వర్గీయులు సంబరానికి సై అంటున్నారు. ఒక్క నియోజకవర్గంలో రెండు వర్గాలతో కాంగ్రెస్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వర్సెస్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా జరిగిన ఇంటి పోరు ప్రోటోకాల్ పాటించలేదని రచ్చకెక్కాయి. ఇద్దరు నేతలు వనపర్తిలో బలంగా ఉండడంతో మొదటగా కాంగ్రెస్ అధిష్టానం చిన్నారెడ్డికి టికెట్ కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో మెగా రెడ్డికి టికెట్ కన్ఫామ్ చేయడం, వనపర్తి రాజకీయాల్లో కొత్త ఊపు అందుకుందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించాలి అంటే అది కేవలం మెగా రెడ్డి వల్లనే అవుతుందని అప్పటి రోజుల్లో మెగా రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

అసెంబ్లీ ఎలక్షన్లో అంతా సైలెంట్ గా ఉన్నప్పటికీ అనంత పరిణామాలు నియోజకవర్గంలో ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు. నియోజకవర్గంలో ఒకరినొకరు సమాచారం లేకుండా కార్యక్రమాలు మొదలు పెడుతున్నారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగళవారం రోజు తండాలో హెల్త్ సెంటర్ ను ప్రోటోకాల్ పాటించకుండా చిన్నారెడ్డి ప్రారంభించాడని ఇప్పుడు ఈ సమస్య పెద్ద అగ్గి రాజేసింది. వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి పేరు లేకుండా ఓపెనింగ్ చేయవద్దని ఘనపూర్ ఎమ్మార్వో పాండు నాయక్ వాదించినా కూడా వినకుండా హెల్త్ సెంటర్ ను చిన్నారెడ్డి ప్రారంభించడం పైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ ఎమ్మెల్యే మెగా రెడ్డిని దొడ్డి దారిన టికెట్ తెచ్చుకున్నాడు అనడం ఎంతవరకు సహజం, అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గోపాల్పేట మండలం టౌన్ అధ్యక్షుడు శివన్న అన్నారు. గతంలో జరిగిన సంఘటనలు వీడియోలు స్థానిక గ్రూపులలో వైరల్ గా మారాయి 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్న చిన్నారెడ్డి అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి పిలవకుండా నియోజకవర్గంలో అనేక శంకుస్థాపనలు కార్యక్రమాలు చేయడం, ఎంతవరకు కరెక్ట్ అని అప్పుడు నిరంజన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశాడు.

మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా ప్రారంభోత్సవాలు కార్యక్రమాలు చేపడుతాడని మెగా రెడ్డి వర్గీయులు చిన్నారెడ్డి అతని వర్గీల పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా పార్టీకి పనిచేసిన నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులను అలాగే చిన్నారెడ్డి మీద దాడి చేసిన నాయకులను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ ప్రతిష్టను దిగజారుతున్నా, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ అలాగే ప్రాణాలిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.

అదేవిధంగా దొడ్డి దారిన టిక్కెటు తెచ్చుకోవాల్సిన అవసరం రెడ్డికి లేదని నియోజకవర్గంలో మెగా రెడ్డికి టికెట్ ఇస్తేనే ప్రత్యర్థి నిరంజన్ రెడ్డిని ఓడించే సైతం మేఘారెడ్డికి ఉందని గ్రహించి టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అలాగే రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్న మెగా రెడ్డి పై విమర్శలు చేయడం తగదని వర్గీయులు విలేకరుల సమస్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఇంచార్జ్ సత్య శిలా రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొంకి వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు శీనన్న, ఉపాధ్యక్షుడు మంగ దొడ్డి నాగ శేషు యాదవ్, అదేవిధంగా గోపాల్పేట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed