- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శ్రీజ, శిరీష్ భరద్వాజ్ విడిపోవడానికి అసలు కారణం అదేనా?..ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలన నిజాలు
దిశ, సినిమా: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మెగా ఫ్యామిలీని కాదని ఇంట్లోనుంచి వెళ్లిపోయి శిరీష్ భరద్వాజ్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో దుమ్ము దుమారం రేపింది. చాలా రోజులవరకు హాట్ టాపిక్ అయ్యింది. ఇక మెగాస్టార్‌గా రాణిస్తున్న చిరంజీవి కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. రకరకాలుగా దీనిపై చర్చ కూడా నడిచింది. అయితే దీనిపై స్టార్టింగ్‌లో ఆవేశానికి, బాధకి గురైనా మెగా ఫ్యామిలీ ఆ తర్వాత శ్రీజ సంతోషంగా ఉండడమే తమకు కావాల్సిందని చెబుతూ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంతా దీన్ని మర్చిపోయారు. ఈ క్రమంలో త్రీ, ఫోర్ ఇయర్స్‌కి మళ్లీ సీన్‌రివర్స్ అయ్యింది. శిరీష్ వరకట్నం కోసం వేధిస్తున్నాడనే ఆరోపణలతో శ్రీజ విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. కాగా అప్పటికే వీరికి కూతురు నివృతి కూడా ఉంది. అయితే దీనిపై అప్పట్లోనే శిరీష్ స్పందించారు.
ఆయన స్పందిస్తూ.. తాను వరకట్నం కోసం వేధిస్తున్నాను అనేది నిజం కాదని, అవి తప్పుడు ఆరోపణలు అని, దానికోసమే కోర్ట్‌కి వెళ్లామని, కోర్ట్‌లో అది తప్పు అని తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు శిరీష్. అయితే శ్రీజ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది శ్రీజనే అడగాలని చెప్పారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలియదని, అయితే ఇది తమ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే అని, సెట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు శిరీష్. అంతేకాదు ఈ సందర్భంగా శిరీష్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాత్కాలిక మిస్ అండర్ స్టాండింగ్ అని చెప్పిన శిరీష్ తర్వాత తాము కలుస్తామని, శ్రీజతో తాను కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను పాప, శ్రీజ ముగ్గురం కలిసే ఉంటామని చెప్పారు. కౌన్సిలింగ్‌కి వెళితే సమస్య సాల్వ్ అవుతుందని అనుకుంటున్నట్టు తెలిపారు. పెద్దలు కూర్చొని మాట్లాడితే ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందని, అలానే సెట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ గురించి చెబుతూ, ప్రేమ అనేది అంత ఈజీ కాదని, కష్టాలు, సుఖాలు అన్నీ ఎదుర్కొని గట్టిగా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు శిరీష్. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కాగా 2011లో శ్రీజ విడాకుల కేసు నమోదు చేయగా, మూడేళ్లకి కోర్టు విడాకులు జారీ చేసింది. అనంతరం కొంత గ్యాప్‌తో శ్రీజ మరో పెళ్లి చేసుకుంది. అలాగే శిరీష్ భరద్వాజ్.. శ్రీజతో విడాకుల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరో వివాహం చేసుకున్నారు. ఇక అనారోగ్యంతో శిరీష్ గత నెలలో కన్నుమూసిన విషయం తెలిసిందే.