రంగంలోకి దిగిన కేటీఆర్.. స్వయంగా నాయకులకు ఫోన్

by Sumithra |
రంగంలోకి దిగిన కేటీఆర్.. స్వయంగా నాయకులకు ఫోన్
X

దశ, గద్వాల ప్రతినిధి : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి మారుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామి రెడ్డి పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలోకి మారుతుండడంతో పార్టీ కాళీ కాకుండా స్వయంగా కేటిఆర్ ఫోన్ చేసి ప్రముఖ నాయకులకు భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని సముచిత గౌరవం ఉంటుందని, భవిష్యత్తులో పార్టీ అన్ని రకాలుగా అండ ఉంటుందని నాయకులు తెలిపినట్టు సమాచారం. నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ పునాది గట్టిగా ఉందని తొందరలోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వుండదని భవిషత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకులతో కేటీఆర్ మాట్లాడారని సమాచారం.

గద్వాల పట్టణంలోని ప్రముఖ బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో వున్న నాయకుడితో కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. అదే విధంగా గట్టు బాసు హనుమంతు నాయుడుతో పార్టీలొనే కొనసాగాలని తెలిపారని, పార్టీ లొనే కొనసాగుతామని హనుమంతు మీడియా ముందు తెలిపారు. త్వరలోనే గద్వాలలో కేటీఆర్ పర్యటించే అవకాశం ఉన్నదని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గద్వాల నాయకులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైన బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ప్రతిష్టత తీసుకున్నదని తెలుస్తుంది. గద్వాల నియోజకవర్గంలోని బీసీలు, నగరంలోని ప్రముఖ బీసీ నాయకుడు బాసు హనుమంత నాయుడు, ఆంజనేయులు గౌడ్, గొంగళ్ల రంజిత్, మాజీ జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డిలు బీఆర్ఎస్ వైపు భవిష్యత్తు లో కలిసి వుండే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed