Urban Development : అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా వనపర్తి, నాగర్ కర్నూల్

by Aamani |   ( Updated:2024-10-26 16:01:33.0  )
Urban Development : అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా వనపర్తి, నాగర్ కర్నూల్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో రెండు కొత్త అర్బన్ డెవలప్మెంట్(Urban Development) అథారిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు కాగా.. కొత్తగా నాగర్ కర్నూల్, వనపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వనపర్తి కార్బన్ డెవలప్మెంట్ అథారిటీలో 5 మున్సిపాలిటీలు, 210 గ్రామపంచాయతీలను, నాగర్ కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నాలుగు మున్సిపాలిటీలు , 315 గ్రామాలను కలిపి ఏర్పాటు చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఏర్పడిన మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ (Urban Development) అథారిటీ లో మరో 153 గ్రామాలను చేర్చారు.

నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ వివరాలు : తిమ్మాజీపేట మండలంలో 19 గ్రామాలు, బిజినేపల్లి మండలంలో 24,, నాగర్ కర్నూల్ మండలంలో 21, తాడూరు మండలంలో 22, తెలకపల్లి మండలంలో 22, కల్వకుర్తి లో 18, ఊరుకొండ లో 12, వెల్దండలో 16, చారగొండలో 7, వంగూరు మండలంలో 19, పెద్దకొత్తపల్లి మండలంలో 26, కోడేరు 8, కొల్లాపూర్ 17, పెంట్లవెల్లి 8, అచ్చంపేట 14, అమ్రాబాద్ ఒకటి (దుర్గా దీన్నే), బల్మూరు 17, లింగాల 18, ఉప్పునుంతల 22 గ్రామాలతో నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అయ్యింది.

వనపర్తి కార్బన్ డెవలప్మెంట్ అథారిటీ : వనపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో అమరచింత మండలంలో 13, మదనాపూర్ 16, పెద్దమందడి 13, ఖిల్లా ఘనపూర్ 20, గోపాల్ పేట 8, రేవల్లి 7, పాన్ గల్ 22, వనపర్తి 18, కొత్తకోట 20, ఆత్మకూర్ 14, పెబ్బేరు 19, శ్రీరంగాపూర్ 8, వీపనగండ్ల 11, చిన్నంబావి 16, ఏదుల మండలంలోని ఎనిమిది గ్రామాల ను కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేశారు.

పెరిగిన మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ..

మహబూబ్ నగర్ డెవలప్మెంట్ అథారిటీలో మరికొన్ని మండలాల పరిధిలోని గ్రామాలను చేరుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మహబూబ్ నగర్, భూత్పూరు, జడ్చర్ల మునిసిపాలిటీలను కలిపి ఏర్పాటైన ముడా లో కొత్తగా మూసాపేట మండలంలో 20 గ్రామాలు, మహమ్మదాబాద్ 8, మిడ్జిల్ 16, దేవరకద్ర 16, హన్వాడ 4, చిన్న చింతకుంట 17, కౌకుంట్ల 9, అడ్డాకుల 14, బాలానగర్ 6, నవాబుపేట 10, కోయిలకొండ 28, జడ్చర్ల మండలంలోని ఐదు గ్రామాలను అదనంగా ముడా లో చేర్చారు.

అభివృద్ధికి.. మంచి అవకాశం : యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. ఇష్టం వచ్చినట్లుగా వెంచర్లు చేస్తూ కొంతమంది పేదలను మోసం చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు కావడం.. ఆ తర్వాత వాటికి సరైన అనుమతులు, వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడవలసి వచ్చేది. అర్బన్ డెవలప్మెంట్ పరిధిని విస్తరించడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నియమ నిబంధనల ప్రకారము వెంచర్ల ఏర్పాటు, భూముల క్రయవిక్రయాలు జరుగుతాయి. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కి కృతజ్ఞతలు.


గతంలో నియోజకవర్గానికి న్యాయం జరగలే : అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల.

మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అయిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలకు సరైన న్యాయం జరగలేదు. ఇప్పుడు నియోజకవర్గంలో మరిన్ని మండలాలు గ్రామాలు ముడా పరిధిలోకి వచ్చాయి. అభివృద్ధికి సంబంధించి వచ్చే నిధులను సాధించుకొని మా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను అభివృద్ధి చేస్తాం.


శుభ పరిణామం : కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి.

నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు మండలాలు, గ్రామాలను చేర్చడం శుభ పరిణామం. ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చెందించుకోవడానికి అవకాశం రానుంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం.


కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం : మెగా రెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి

వనపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొల్లాపూర్, వనపర్తి, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం. వనపర్తిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.


అభివృద్ధికి.. మరింత అవకాశం : కె రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్.

అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మరింత జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. రాష్ట్ర నిధులే కాకుండా, కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి సజావుగా సాగుతుంది.



Advertisement

Next Story