- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టండి: ఎస్పీ వెంకటేశ్వర్లు
దిశ, నారాయణపేట ప్రతినిధి: దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నేరస్థులకు శిక్ష పడేవిధంగా చూడాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని సీఐలు, ఎస్ఐలతో ఏఎస్పీ నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ఇప్పటికే జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ లలో ప్రమాదాలు జరుగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన హెచ్చరిక బోర్డ్ లు, రేడియం స్టిక్కర్స్, ఇతర మార్పులు చేర్పులు చేయాలన్నారు.
జిల్లాలో నకిలీ విత్తనాలను ఎవరైనా రైతులకు అమ్మి మోసం చేస్తే అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కర్ణాటక నుంచి జిల్లాలోకి ఎలాంటి నకిలీ విత్తనాలు రాకుండా బోర్డర్ పోలీస్ స్టేషన్లలో ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ కే.సత్యనారాయణ, అగ్రికల్చర్ ఆఫీసర్ జాన్ సుధాకర్, సీఐలు శ్రీకాంత్ రెడ్డి, సీతయ్య, జనార్ధన్, ఎస్ఐలు అశోక్ బాబు, పర్వతాలు, విజయ్ భాస్కర్, నరేందర్, శ్రీనివాసులు, విక్రమ్, రమేష్, శ్రీనివాస రావు, శ్యామ్ సుందర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.