అంతర్గత ఆడిట్ విభాగానికి తుంగతుర్తి ఎంపీడీవో..

by Sumithra |
అంతర్గత ఆడిట్ విభాగానికి తుంగతుర్తి ఎంపీడీవో..
X

దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషు కుమార్ అంతర్గత ఆడిట్ విభాగంలోకి వెళ్లారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో పది రోజుల పాటు విధులు నిర్వహించనున్నారు. తిరిగి ఆయన ఈనెల 11 లేదా 12 న తుంగతుర్తి మండలానికి రానున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై ఈ ఆడిట్ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆడిట్ విభాగం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తమ పథకాల పై ఆడిట్ చేసే సందర్భానికి ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అంతర్గత ఆడిట్ జరగనుంది. ఆడిట్ టీంలో ఒక లీడర్ తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కేటాయించిన జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఆడిట్ జరపనుంది. కేంద్ర పరిధిలోని రూరల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన 8 స్కీముల పై ఆడిట్ చేసి అందులో ఉన్న లోటు పాట్లు, సవరణలను ఆడిట్ టీం గుర్తిస్తుంది. పెన్షన్లు, ఎన్ జీఆర్ఎస్, సెర్ఫ్, ప్రధాని ఆవాస యోజన, తదితర పథకాలన్నీ ఆడిట్ పరిధిలోకి వస్తాయి.

తుంగతుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న శేషు కుమార్ 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు (తుంగతుర్తిలో) చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఆడిట్ విభాగంలో ఆయన పాల్గొంటున్నారు. తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, అశ్వరావుపేటతో పాటు మరో రెండు మండలాలలో జరిగిన ఆడిట్ టీంలో పని చేశారు. అక్కడ ప్రధానంగా గ్రామీణ సడక్ యోజన, పీఎంజీవైఎస్, తదితర కేంద్ర పథకాల అమలు పై ఆడిట్ నిర్వహించారు. ఈ ఏడాది జూన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాంతంలో జగనన్న గృహాల పై జరిగిన ఆడిట్ లో పాల్గొన్నారు. అలాగే ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెంతో పాటు మరో రెండు మండలాల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై ఆడిట్ నిర్వహించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఎంపికైన మండలాల్లో 10 రోజుల పాటు ఆడిట్ చేయనున్నారు. చేసిన ఆడిట్ వ్యవహారాన్నంత సంబంధిత శాఖకు అందజేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed