ఆ రహదారిలో ప్రయాణం నరకమే..

by Aamani |
ఆ రహదారిలో ప్రయాణం నరకమే..
X

దిశ,అలంపూర్ : వామ్మో.. ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఒళ్ళు గుల్ల కావడం ఖాయం.’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు, వాహనదారులు. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో కాదు.. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల కేంద్రం నుండి చెన్నిపాడు పోతులపాడు గ్రామాల నుండి కర్నూల్ కి వెళ్లే దారి ఇది. సుమారు 6 కిలోమీటర్లు ఈ దారి గోతులు పడి అస్తవ్యస్తంగా మారింది. ఆర్ ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీస మరమ్మతులు చేపట్టాల్సిన ధ్యాస కూడా మరిచారు.

ప్రతి రోజు ఆ గ్రామాల నుండి బడికి వెళ్లే విద్యార్థులు భయం నీడలో ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం గుంతలతో నిండి ఉండటం.. దీనికి తోడు తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ ను తప్పించుకోవడానికి భారీ వాహనాలు ఎటువైపు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో రోడ్డు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిన అధికారులు మాత్రం పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లలు ఇదే దారిలో ప్రతి రోజూ నడుచుకుంటూ, ఆటోల్లో స్కూళ్లకు వెళ్తుంటారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని, రైతులు కూడా ఇదే దారి వెంట ట్రాక్టర్లలో, ఎద్దుల బండి పై వెళ్లాలంటే కూడా భయానక పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా పాలకులు స్పందించి నూతన రోడ్డు ఏమో కానీ కనీసపు మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం, అత్యవసర పరిస్థితి దాపురించి ఉందని చెన్నిపాడు పోతలపాడు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలకు వెళ్లి దారులే సక్రమంగా లేకపోతే ఆ గ్రామాల అభివృద్ధి ఏమో కానీ, మా ప్రాణాలు రోడ్డుకే బలి కావడం గ్యారెంటీ మాత్రం తప్పదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ దారి వెంట నడిచిన వాహనాలపై ప్రయాణించిన పైకి వెళ్లడానికి టికెట్ మాత్రం కన్ఫామ్ గా ఉంటుందని వాపోతున్నారు. ఎన్నికల అప్పుడు ఓట్లు దండుకోవడానికి మాత్రం పదేపదే వచ్చిన పాలకులు కూడా... ఈ గ్రామాల వైపు రావడం లేదు. గ్రామాలను ప్రజా పాలకులు విసిట్ చేసినప్పుడే మా సమస్యలు తెలుస్తాయని, ఆరోజు హామీలు ఇచ్చి ఓట్లు దండుకుంటారు తప్ప కనీసపు హామీ ఇవ్వలేని పరిస్థితి ఉందని మరికొందరు అంటున్నారు.

Advertisement

Next Story