- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం
దిశ, నాగర్ కర్నూల్ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు చెరువులు కుంటలు నిండి అలుగు పారి వాగులు వంకలు పొంగి పొర్లాడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని కాలువలకు గండ్లు పడడంతో ఒక్కసారిగా చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరి ప్రమాదకర పరిస్థితిలో రాకపోకలను నిలిపివేస్తూ పోలీసులు రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. తూడుకుర్తి నాగనూల్ నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులు పూర్తిగా నిండి నాలుగు పారుతుండడంతో కల్వకుర్తి నాగర్ కర్నూల్ ప్రాంతాల మీదుగా బస్సు సేవలను నిలిపివేశారు.
దీంతోపాటు కేసరి సముద్రం చెరువు అలుగు పారుతుండడంతో తాడూరు, చర్ల తిరుమలాపూర్ వంటి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు వట్టెం గట్టు వద్ద ఏర్పాటుచేసిన ప్రాంతంలో నిర్వాసితుల ఇళ్లల్లోకి వట్టెం గుట్ట కొండ చర్యలు విరిగి పడి వారి పిల్లలకు చేరడంతో గ్రామస్తులు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.