- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ సొంతూరులో జరిగిన అభివృద్ధి పనులు ఇవే..
దిశ, అచ్చంపేట/ వంగూరు : సీఎంరేవంత్ రెడ్డి సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం అని అందరూ భావిస్తుంటారు. అదే కోణంలో సీఎం తన స్వగ్రామంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో.. మొదటి ఏడాదిలోనే కావలసిన నిధులు కేటాయించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఇతర శాఖల సమన్వయంతో గడిచిన రెండు నెలల నుంచి అనేక సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. దసరా పండుగకు మొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం మొదటి విడతలో రూ. 40.6 కోట్ల పైగా నిధులను కేటాయించి దసరా పండుగ నాటికి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేశారు.
మారుతున్న గ్రామ రూపురేఖలు...
నిన్న మొన్నటి వరకు కొండారెడ్డిపల్లి అన్ని గ్రామాల మాదిరిగానే ఒక గ్రామం కానీ .. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆ గ్రామానికి ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు..జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం లో ఉన్న తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కోసం అధికారులను ఉరుకులు పరుగులు పెతీస్తున్నారు. స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనే విధంగా.. సీఎం కాకముందు.. సీఎం అయిన తర్వాత గ్రామ రూపురేఖలు పూర్తిగా మార్పు జరుగుతుండడంతో .. గ్రామస్తుల సంతోషానికి అవధులు లేవు.
దసరా నాటికి జరిగిన అభివృద్ధి పనులు...
కొండారెడ్డిపల్లి గ్రామాన్ని గత రెండు నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు రూ. 46. 6 ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సర్వశక్తుల కృషి చేశారు. ఈ క్రమంలో గ్రామంలో నూతనంగా రూ. 45 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, ప్రాథమిక పశువైద్యశాల రూ.58 లక్షలతో, బీసీ కమ్యూనిటీ హాల్ రూ.55 లక్షలతో అత్యాధునికంగా నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయ భవనాన్ని, రూ .72లక్షల తో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు.
దసరా పండుగ నాటికి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అధికారులు కృషి చేసినప్పటికీ కొన్ని పనులు జరగాల్సి ఉంది. ప్రధానంగా గ్రామానికి భూగర్భ మురుగు నీటి పైప్లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.18 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం ప్రధాన రహదారి మీదుగా విద్యుత్తు దీపాలంకరణ పనులకు రూ.32 లక్షలతో నిర్మించే చిల్డ్రన్పార్కు, బహిరంగ వ్యాయామశాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం కావడం అదృష్టంగా భావిస్తున్నామని గ్రామ మాజీ సర్పంచ్ భారతమ్మసంతోషం వ్యక్తం చేసింది. చాలా అభివృద్ధి పనులు జరిగాయని, అండర్ డ్రైనేజీ తో పాటు..అంతర్గత సిసి రోడ్లు, పాల డైరీ కేంద్రం తదితర కొన్ని పనులు జరగాల్సి ఉందని, దసరా పండుగ మరింత ఆనందంతో జరుపుకున్నామన్నారు. మొత్తంగా ఆ గ్రామానికి మంచి రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి దసరా పండగను స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పండుగ వేడుకలు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా..గతంలో ఎన్నడు లేని విధంగా సీఎం ప్రత్యేకంగా గ్రామస్తులతో ఫోటోషూట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరితో కరచాలని చేస్తూ సీఎం ఫోటో దిగటం.. నేను సీఎంతో ఫోటో దిగాను అని చెప్పుకునే విధంగా గ్రామస్తులకు కొద్ది గంటలపాటు మరింత సంతృప్తికరంగా సీఎం గడిపిన తీరు పలువురు హర్షం వ్యక్తం చేశారు.