- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
111 జీఓ ఎత్తివేతపై చర్చ జరగాలి.. మాజీ ఎంపీ వి.హన్మంత రావు
దిశ, జడ్చర్ల : రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన 111జీ ఓ పై పొలిటికల్ బీఏసీలో చర్చ జరగాలని రాష్ట్ర మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వి.హన్మంత రావు అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రూక్కంపల్లి వద్ద స్వల్ప అస్వస్థతకు గురై రెండు రోజులుగా విరామం ప్రకటించి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కను శుక్రవారం వి.హెచ్ పరామర్శించారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్టంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ అనుమతులు లేకుండానే ప్రభుత్వం 111 జీఓను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలోని అంశం అయినప్పటికీ సీఎం కేసీఆర్ 111 జీఓ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక కుట్ర దాగి వుందని అన్నారు. ఈ విధంలో కేంద్ర మంత్రి కూడ నేటికి స్పందించలేదని గుర్తు చేశారు.
అదే విధంగా బీఆర్ ఎస్ పార్టీకి తామే ప్రసత్యామ్నాయ మని చెప్పుకుంటున్న రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడ నోరు విప్పడం లేదని అన్నారు. ఓట్ల కోసం 111 జీఓ పట్ల రాష్ట్ర సర్కారు నాటకం ఆడుతున్నది విమర్శించారు. ఇదే విషయంలో అన్ని రాజకీయ పక్షాలు చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది కాకా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేక విషయాల్లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేదల భూములు భరోసా ఇస్తున్నదని అన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని, ప్రతిభఘటించవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రెస్ మీట్ లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్సీ రాములు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.