తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Kalyani |   ( Updated:2023-09-17 11:02:05.0  )
తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయం - మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్ల స్వల్ప వ్యవద్ధిలోనే రాష్ట్రంతో పాటు,జిల్లాలో సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.సెప్టెంబర్ 17 తెలంగాణ రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని ఆయన అన్నారు.అప్పటి నుంచి 2014 జూన్ వరకు సమైక్య పాలనలో తెలంగాణ వివక్షకు గురై ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నదని ఆయన ఆవేదన చెందారు.

గత 9 ఏండ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పథంలో దూసుకపోతూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు.అనంతరం పాఠశాల,కళాశాల ల విద్యార్థులచే నిర్వహించిన సాంస్క్రతిక కార్యక్రమాలను అలంరించారు.తర్వాత నిజాం నిరకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన వకీల్ భీమయ్య ను శాలువ,పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవినాయక్,ఎస్పీ నరసింహ,జడ్పీ చైర్మెన్ స్వర్ణసుధాకర్ రెడ్డి,దెవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వరరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed