మళ్ళీ ఉప్పొంగిన ఎర్రగట్టు పెద్దవాగు

by Kalyani |
మళ్ళీ ఉప్పొంగిన ఎర్రగట్టు పెద్దవాగు
X

దిశ, కొల్లాపూర్: నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షానికి మంగళవారం ఎర్రగట్టు పెద్దవాగు ఉప్పొంగింది. ఎగువన నల్లమల కొండల్లో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి నార్లాపూర్ _ముక్కిడిగుండం గ్రామాల మధ్య ఎర్రగట్టు పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ముక్కిడిగుండం ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. కొల్లాపూర్ మండల కేంద్రానికి వివిధ పనుల మీద ఆటోలు, ద్విచక్ర వాహనాలతో ముక్కిడిగుండం నుంచి వయా మొలచింతపల్లి ఎల్లూరు మీదుగా కొల్లాపూర్ కు చేరుకున్నారు. అయితే ముక్కిడి గుండం నార్లాపూర్ మధ్య ఎర్రగట్టు పెద్ద వాగు పై రూ. 9.5 కోట్ల వ్యయంతో వంతెన పనులు జరుగుతుండగానే వరదలు రావడం ఇది రెండవసారి. వంతెన పనులు పూర్తయ్యే వరకు ముక్కిడి గుండం వాసుల రాకపోకలకు కష్టాలు తప్పవు. అయితే వాగు పొంగడంతో మరో ఐదు రోజులపాటు వంతెన నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడనున్నది.

Next Story

Most Viewed