- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకెళ్తుంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హైటెక్ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన పాలమూరు గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 2014 కంటే ముందు తెలంగాణ అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి గురైందని, అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.
సభకు హాజరైన ఒకరిని ప్రభుత్వం పనితీరు ఏవిధంగా ఉందంటూ మంత్రి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా 55 ఏళ్లుగా తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, గతంలో ఎవ్వరికీ పెన్షన్లు లేవని, గ్రామంలో రోడ్లు, కరెంటు ఉండేవి కాదని సదరు వ్యక్తి సమాధానం ఇచ్చాడు. గతంలో రైతులు ఎరువుల కోసం పడని పాట్లు లేవని, రోజంతా ఎండలో, పోలీసు రక్షణలో ఎదురు చూసేవారని మంత్రి అన్నారు. నేడు గొల్ల, కురమలకు ఉచితంగా గొర్రెలు, ముదిరాజులకు చేప పిల్లలను అందిస్తున్నామని, రజకులకు, నాయీ బ్రాహ్మణలకు అండగా ఉంటూ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.
కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కోడూరు గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.