- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట: MLA Bandla Krishna Mohan Reddy
దిశ, గద్వాల టౌన్: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నూతన ఐసీయూ వార్డ్, వృద్ధుల ఫిజియో థెరపీ కేంద్రం, జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం, ప్రాణవాయువు గది, మార్చురీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు.అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పలు ఆరోగ్య కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నేతృత్వంలో, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వైద్య రంగానికి పెద్ద పీట వేసి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీయస్.కేశవ్, ఎంపీపీ విజయ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్, డీఎంహెచ్ఓ, సూపరిటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.