- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉప్పొంగిన పెద్దవాగు.. ఆరు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
దిశ,అలంపూర్ : రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతూనే ప్రవహిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లే రహదారులపై ఉన్న వంకలు, వాగులు నీటి కుంటలు వర్షపు నీటితో నిండుకుండలా కనిపిస్తున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు- అమరవాయి మధ్య పెద్ద వాగు ఉధృతి రాత్రి 7 గంటలైనా తగ్గుముఖం పట్టలేదు. దీంతో అమరవాయి నారాయణపురం పెద్ద ఆముదాలపాడు, కలుకుంట్ల, గోకులపాడు చెన్నిపాడు గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మనవపాడు మండల కేంద్రానికి ఆయా గ్రామాల నుండి వచ్చిన విద్యార్థుల సైతం ఎటు వెళ్లాలో అర్థం కాక పెద్దవాగు సమీపంలో రోడ్డుపైనే గంటల పాటు నిల్చున్నారు. మానోపాడు, నారాయణపురం, గోకులపాడు గ్రామాల దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు చోట పోలీస్ పహరాను ఏర్పాటు చేశారు. వాగులు దాటలేని పరిస్థితి ఉందని ఎవరు కూడా దాటడానికి సాహసం చేయకండి అని ఎస్సై చంద్రకాంత్ హెచ్చరిస్తూ గస్తీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి వాగు ప్రవాహం గంట గంటకు పెరుగుతూనే ఉంది.