Kappatrala: ‘ఒక్క అధికారిని కూడా ఊర్లో అడుగు పెట్టనివ్వొద్దు’

by Gantepaka Srikanth |
Kappatrala: ‘ఒక్క అధికారిని కూడా ఊర్లో అడుగు పెట్టనివ్వొద్దు’
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామస్తులు(Kappatrala Village) కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామసభ(Grama Sabha) సమావేశం నిర్వహించారు. యురేనియం తవ్వకాల(Uranium Mining)ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరాలని గ్రామసభలో తీర్మానం చేశారు. అంతేకాదు.. శాంపిల్స్ కోసం గ్రామానికి వచ్చే అధికారులను అడ్డుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామం మొత్తం స్వీయ నిర్భందంలోకి వెళ్లింది. తక్షణమే యురేనియం తవ్వకాల(Uranium Mining)ను నిలిపివేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

గతకొన్ని రోజులుగా గ్రామంలోకి ఎలాంటి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి వివరాలు తెలుసుకొని లోనికి పంపిస్తున్నారు. కప్పట్రాల(Kappatrala Village)తో పాటు పి.కోటకొండ, బేతపల్లి గ్రామాల ప్రజలు సైతం తవ్వకాలను అడ్డుకుంటున్నారు. పచ్చటి పల్లెల్లో యురేనియం తవ్వకాల వార్తతో ప్రజల్లో అలజడి చెలరేగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలతో తమ ప్రాణాలతో ఆటలాడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. బోర్లు వేసేందుకు వస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story