ఇసుక ఇక్కట్లు.. అయోమయంలో భవన నిర్మాణరంగం

by Aamani |
ఇసుక ఇక్కట్లు.. అయోమయంలో భవన నిర్మాణరంగం
X

దిశ,నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లాలో ఇసుక కొరత కారణంగా నిర్మాణరంగం అయోమయంలో ఉంది. అసలే వెనకబడ్డ నారాయణపేట ప్రాంతం మెజారిటీ ప్రజలు కూలీలు గానే ఉన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కూలీలకు ఇసుక కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు 20 రోజుల పైగా అవుతున్న ఇసుక రీచుల నుంచి ఇసుక సరఫరా పూర్తిగా నిలిచింది.. దీంతో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఇసుక ఉంటేనే నిర్మాణరంగ అనుబంధ పనులు సాఫీగా జరుగుతాయి. ఇసుక సరఫరా నిలిచిపోవడంతో కూలీలు రాక నిర్మాణరంగం పనులు నిలిచిపోతున్నాయి.

నారాయణపేట జిల్లాలో ఇసుక రీచులు మాగనూరు, కృష్ణ , నాగిరెడ్డిపల్లి తదితర చోట్ల అనుమతి ఉన్న ఇసుక రీచ్లు ఉన్నాయి. అధిక వర్షాల కారణంగా వాగులు పారుతుండడంతో ఇసుకతో ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా అప్పటికి ప్రత్యామ్నాయంగా నైనా ఇసుకను సరఫరా చేస్తే నిర్మాణరంగా కూలీలకు మేలు జరుగుతుందని లేకపోతే కూలీలు ఆర్థికంగా నష్టపోతారని చెబుతున్నారు. ఇసుక కోసం స్లాట్ బుక్ చేసుకున్న వినియోగదారులు అయోమయంలో పడ్డారు. ఇసుక సరఫరా జరగకపోతే అక్రమ ఇసుక వ్యాపారానికి అక్రమార్కులు తెర లేపే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తేనే సరసమైన ధరతో పాటు నాణ్యమైన ఇసుక లభించే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు, ఇసుక వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed