రైతులను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు.. చేలలో చేరుతూ పంట ధ్వంసం

by Shiva |
రైతులను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు.. చేలలో చేరుతూ పంట ధ్వంసం
X

దిశ, మక్తల్: కృష్ణానది తీర ప్రాంతంలో చూడడానికి ముచ్చట గొలుపే కృష్ణ, జింకలు ఒక్కసారిగా పచ్చని పంట పొలాలపై దాడులు చేస్తూ చేన్లను నాశనం చేస్తున్నాయి. పదిహేను ఏండ్లుగా కృష్ణ జింకల బాధలను తట్టుకోలేక రైతులు సంబంధిత అటవీశాఖ అధికారులకు.. ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఓ రైతు అధికారులకు చేసినా, వినతిపత్రాలకు సంబంధించిన వివరాలతో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. అటు ప్రభుత్వం.. ఇటు అధికారులలో కదలిక వస్తోంది.

5 వేలకు పైగా కృష్ణ జింకలు..

నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణ, మాగనూరు, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో గత పదేండ్లకు ముందు అక్కడక్కడ కృష్ణ జింకలు కనిపించేవి, వన్య ప్రాణి సంరక్షణ చట్టాలు పకడ్బందీగా అమలు అవుతుండడంతో పదిహేళ్లుగా కృష్ణ జింకల సంతతి విపరీతంగా పెరిగింది. అప్పట్లో పదులసంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు దాదాపుగా 5వేలకు పైగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆయా గ్రామాలకు సమీపాలలో ఉన్న మైదాన ప్రాంతాలలో మేత మేసేప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేస్తే, నష్టం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. కానీ రైతులు సాగుచేసిన పంట చేళ్లలో పడి నాశనం చేస్తున్నా యి. ఒక్కసారిగా 150 నుంచి 300 దాకా జింకలు అన్ని పంట పొలాల పై దాడులు చేస్తున్నాయి. క్షణాలలో మొక్కలను మొదలుకుని.. పంటకు వచ్చిన చేనులను తినేస్తున్నాయి.

పదేళ్లుగా నష్టాలే..

గత పదేండ్లుగా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న మండలాలలో సాగుచేసిన పంట పొలాలను కృష్ణ జింకలు నాశనం చేస్తున్నడంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకుం టే తమపై కేసులు ఎక్కడ నమోదవుతాయోనని భయంతో ధైర్యం చేయలేకపోతున్నారు. సంబం ధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పి నా ప్రయోజనం లేకపోయింది. దీంతో రైతులం తా సంఘాలుగా ఏర్పడి పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అప్పటికి ప్రయోజనం లేకపోవడంతో ఓ రైతు హెచ్ఆర్సీలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్ల క్ష్యంపై ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత శాఖల అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వస్తోంది.

సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు నిధులు..

మక్తల్ మండల పరిధిలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న 74ఎకరాల ప్రభుత్వ భూమిలో జుంకాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం రూ.2.7కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. దాదాపుగా 8అడుగుల ఎత్తు వరకు పెన్సింగ్ ఏర్పాటు చేసి జింకలకు అవసరమైన ఆహారం, నీటి సౌకర్యాలు కల్పన కోసం చర్యలు తీసుకోనున్నారు. అధికారులు జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు పనులను పూర్తిచేసి తమ పంటచేన్లను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పంటకు కాపలా ఉండాల్సిందే

సాగు చేసిన పంట పొలాల వద్ద రైతులు ఉదయం మొదలుకుని చీకటి పడే వరకూ పంట చేన్ల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జింకలు రాకుండా ఉండేందుకు పంటల వద్ద రకరకాల శబ్దాలు చేయడంతో పాటు.. రైతులే స్వయంగా మరికొన్ని చోట్ల అరుపులు చేస్తూ, తమ పంటలకు కాపలాగా ఉంటున్నారు. ఏమాత్రం ఆదమరిచినా కృష్ణ జింకలు పంట పొలాల్లో చేరి అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed