- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ మైనింగ్ తో అడ్డాకుల అందం మాయం..
దిశ, అడ్డాకుల : అడ్డాకుల అంటే అందమైన గట్టులున్న ప్రాంతం. ఇంతటి సుందరమైన ప్రాంతాన్ని మైనింగ్ పేరుతో కొన్ని రోజులలో గట్టు మాయమైపోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అడ్డాకుల మండల శివారులో గల సర్వేనెంబర్ 161 ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తెళ్లరాళ్ల పలుగు గుట్టపై మైనింగ్ త్రవ్వకాలు జరుపుతున్నారు. కోట్ల విలువ చేసే తెల్లరాయిని, రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో బెంజ్ లారీల ఓవర్ లోడ్ తో కొల్లగొడుతూ మైనింగ్ మాఫియా అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారని ఇంత జరుగుతున్నా మైనింగ్ , రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నీటి చూడలేదని అడిగే నాధుడే లేడని ప్రజలు మండిపడుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పచ్చని చెట్లను తొలగించి ప్రకృతి వనరులను దోచేస్తున్నారని, అక్రమ బ్లాస్టింగ్ లతో అడ్డాకుల పెద్ద చెరువు కట్టకు ముప్పు పొంచి ఉందని, మిషన్ భగీరథ ట్యాంకుకు పగుళ్లు వచ్చాయని దగ్గర్లో ఉన్న ఇండ్లకు కూడా పగుళ్లు రావడం గమనించామని వెంటనే లీజును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కు, మైనింగ్ అధికారికి ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సొసైటీ అడ్డాకుల కమిటీ గురువారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సొసైటీ అడ్డాకుల మండల కమిటీ ప్రెసిడెంట్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ గౌడ్, కోశాధికారి జగదీష్, బాలయ్య, పురేందర్ రెడ్డి పాల్గొన్నారు.