- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి.. గంజిపేట రాములు..
దిశ, గద్వాల : ఉమ్మడి రాష్ట్రంలో నారాచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందిందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి గంజిపేట రాములు అన్నారు. శుక్రవారం గద్వాల మండలం చేనుగొనపల్లి గ్రామంలో ఇంటింటికీ తెలుగు దేశంపార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాములు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువత రోడ్డున పడ్డారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలకు అండగా నిలిచారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వివిధ శాఖలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించి కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి అసలుకే లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా విధులు నిర్వహించిన కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నేడు కూలీలుగా మారారని వాపోయారు. ప్రతి ఏటా రెండుసార్లు డీఎస్సీని వేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టీడీపీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పారు. తెల్లరేషన్ కార్డుకు తొమ్మిది రకాల వస్తువులను అందించగా.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుందని చెప్పారు.
మిగిలిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో రాత్రిబడులు నిర్వహించి చదువు రాని వారు కూడా సంతకం చేసుకునేలా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం తెలుపుతారు. ఈ కార్యక్రమంలో కేటీదొడ్డి మండల అధ్యక్షులు పుల్లయ్య గౌడ్, గద్వాల మండల అధ్యక్షులు చేనుగోనిపల్లి వేంకటన్న పట్టణ సెక్రెటరీ నర్సింహులు గట్టు మండలం మాజీ అధ్యక్షలు ఉప్పలపాటి నాగరాజు, కేశవ్ వెంకటేష్, అజ్జూ, ఆస్లం, రమేష్ తదతరులు పాల్గొన్నారు.