తహసీల్దార్‌ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

by Hamsa |
తహసీల్దార్‌ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
X

దిశ, ఊట్కూర్ : మండల తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో మాగనూరు మండలంలో విధులు నిర్వహించిన ఆయన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న మండలం కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ హాజరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు ఫిర్యాదులు అందటంతో వాటిపై విచారణ చేపట్టిన అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి తహసీల్దార్ ఎన్ తిరుపతయ్య బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed