జాగ్రత్త.. వెంట్రుకలు కొంటామంటూ.. ఇంటినే దోచేస్తున్నారు

by samatah |
జాగ్రత్త.. వెంట్రుకలు కొంటామంటూ.. ఇంటినే దోచేస్తున్నారు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పాలమూరు ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి మిట్ట మధ్యాహ్నం జన సందడి లేని సమయాలలో ఇండ్లల్లోకి ప్రవేశించి అందిన కాడికి దోచుకొని వెళుతున్నారు. సోమవారం శుభ ఎస్వీఎస్ ఆసుపత్రి సమీపంలో సుభద్ర కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ డిఈఓ డ్రైవర్ రహమాన్ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్న ఐదు తులాల బంగారం, ఆరు తులాల వెండి దోచుకెళ్లారు. పక్కనే ఉన్న నాగర్ కర్నూల్ డిఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న పాషా ఇంటిలోనూ దొంగతనానికి విఫలయత్నం చేశారు. మూడు రోజుల క్రితం మధురానగర్ లో ఆరు తులాల బంగారం, రెండు లక్షల రూపాయలను దోచుకు వెళ్లారు. పట్టణంలో రెండు మూడు ఇండ్లలోను దొంగతనాలు జరిగినట్లు సమాచారం.

వెంట్రుకలు కొనే వారిలా వచ్చి:

మహిళల నుండి వెంట్రుకలు కొని.. స్టీలు సామాను ఇచ్చే వారిలా వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. డిఈఓ కార్యాలయం డ్రైవర్ రెహమాన్ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి సి సి కెమెరాలలో ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దొంగతనాలలో ఆరు తేరి రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 200 కు పైగా కేసులు ఉన్న మిర్యాలగూడకు చెందిన చెంచులక్ష్మి గా అనుమానిస్తున్నారు. మరో మహిళతో కలిసి ఈ దొంగతనాలు చేస్తున్నట్లు సిసి ఫుటేజ్ ల ద్వారా తెలుస్తోంది. ఈ కేసులను చేదించెందుకు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు విహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed