Pujar : కర్ణాటక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌గా ట్రాన్స్‌ జెండర్.. తొలి వ్యక్తిగా రికార్డు

by vinod kumar |
Pujar : కర్ణాటక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌గా ట్రాన్స్‌ జెండర్.. తొలి వ్యక్తిగా రికార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక(Kanataka)లోని విజయనగర శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (Sri krishna University) లో గెస్ట్ లెక్చరర్‌గా తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ నియామకమయ్యారు. అదే విశ్వవిద్యాలయం నుంచి కన్నడలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రేణుకా పూజార్ (Renuka pujar) అనే ట్రాన్స్ జెండర్‌ గెస్ట్ లెక్చర‌ర్‌గా జాయిన్ అయినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ పోస్టు కోసం 30 మంది అభ్యర్థులు పోటీపడగా పూజార్‌కు అవసరమైన విద్యార్హతలు, పీజీలో మంచి మార్కులు ఉన్నాయని, డెమో క్లాసులోనూ ఆమె ఉత్తర ప్రదర్శన కనపర్చిందని తెలిపారు. అనంతరం ఎంపిక కమిటీ పూజార్‌ను సెలక్ట్ చేసినట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్‌గా పూజార్ నిలిచారు.

ఈ సందర్భంగా పూజార్ మాట్లాడుతూ..‘గెస్ట్ లెక్చరర్‌గా ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నా. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. యూనివర్సిటీ అధికారులు సైతం నాకు చాలా సాయం చేశారు. 2017లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే ట్రాన్స్‌జెండర్‌గా మారా. నాకు టీచింగ్ అంటే ఇష్టం, పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌ని కావాలనుకుంటున్నా. ఇతర ట్రాన్స్‌జెండర్లు సైతం ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. కాగా, పూజార్ రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన నివాసి.

Advertisement

Next Story