Harish Rao: ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వండి.. సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

by Prasad Jukanti |
Harish Rao: ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వండి..  సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కందులకు మద్దతు ధరపై రూ.400 బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల కందులు (Red gram) ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని కానీ ఇప్పటి వరకు కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్ లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ (Warangal Declaration)లో భాగంగా కందులకు మద్దతు ధరకు అదనంగా రూ.400 రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారని ఈ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.

కందులకు మద్దతు ధర రూ.7,550 ఉంది. కానీ బహిరంగ మార్కెట్లో రూ.6500 నుండి రూ.6800 మించి క్వింటాలుకు చెల్లింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి క్వింటాలు పైన మద్దతు ధరతో పోలిస్తే రూ.800 రైతులు నష్టపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం కంది రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే వారి గోస తీర్చడానికి కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story