Calcium deficiency: మహిళల్లో కాల్షియం లోపం.. తలెత్తే అనారోగ్య సమస్యలివే..?

by Anjali |   ( Updated:2024-12-28 13:28:29.0  )
Calcium deficiency: మహిళల్లో కాల్షియం లోపం.. తలెత్తే అనారోగ్య సమస్యలివే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కాల్షియం లోపం (Calcium deficiency)తలెత్తితే.. కండరాల నొప్పులు(Muscle aches), కండరాల తిమ్మిరి(muscle cramps), గందరగోళం(confusion), మెమోరీ నష్టం(memory loss), పాదాలు(numbness), చేతులు మరియు ముఖంలో తిమ్మిరి (cramps), పెళుసు, బలహీనమైన గోర్లు(nails), ఎముకలు సులభంగా విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో కాల్షియం లోపించినప్పుడు కూడా ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తాయి. పెళుసుగా ఉండే గోర్లు, తరచుగా కండరాల తిమ్మిరి రావడం, వేళ్లలో తిమ్మిరి, దంత సమస్యలు, జలదరింపు, అలసట, బోలు ఎముకల వ్యాధి(Osteoporosis) వస్తుంది. వీటితో పాటు గుండె సమస్యలు(Heart problems), మానసిక గందరగోళానికి(Mental confusion) కూడా కారణమవుతుంది.

బోలు ఎముకల వ్యాధి..

బోలు ఎముకల వ్యాధి తలెత్తితే వైద్యుల్ని సంప్రదించడం మేలు. ఎందుకంటే రోజు రోజుకు ఈ వ్యాధి ప్రమాదం పెరిగిపోతుంది. చివరకు బోన్స్ విరిగే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం లోపం వల్లే మహిళల్లో ఈ వ్యాధి వస్తుందంటున్నారు నిపుణులు.

అలసటకు దారితీస్తుంది..

మహిళల్లో కాల్షియం లోపిస్తే బలహీనత ఏర్పడుతుంది. అంతేకాకుండా అలసట వస్తుంది. ఏ చిన్న పని చేసిన కూడా వెంటనే అలసిపోతారు. కాల్షియం లోపం కారణంగా కండరాలు కూడా బలహీనంగా మారిపోతాయి.

పునరుత్పత్తి ఆరోగ్యం..

మహిళలు గర్భధారణ టైంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఈ లోపం ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాల్ని తవ్రతరం చేస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed