ప్రభాస్, విజయ్‌లపై కన్నడ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

by Hamsa |   ( Updated:2024-12-28 15:47:21.0  )
ప్రభాస్, విజయ్‌లపై కన్నడ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: కన్నడ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) విలన్‌గా నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. 2022లో ‘విక్రాంత్ రోనా’ సినిమాలో నటించి కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ‘మ్యాక్స్’(Max) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద రాణిస్తుంది. ఈ క్రమంలో.. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కిచ్చా సుదీప్ స్టార్ హీరోలు ప్రభాస్(Prabhas), విజయ్‌(Vijay)లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభాస్ చాలా మంచివాడు. ఆయన సింపుల్‌గా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు.

సక్సెస్ లేదా ఫెయిల్యూర్(Failure) ఏది వచ్చినా ఒకేలా ఉంటారు. హిట్ వచ్చినా ఆ గర్వాన్ని చూపించరు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ప్రేమను పంచుతారు. ఆప్యాయతగా భోజనం కూడా పంపుతారు. అలాగే విజయ్‌ గురించి చెప్పాలంటే.. ఆయనతో నేను ‘పులి’ సినిమాలో నటించాను. అప్పుడు మేమిద్దరం పలు విషయాల గురించి చర్చించుకున్నాం. విజయ్‌ ఎన్నో గొప్ప కలలు కంటుంటారు. వాటిని సాధించేందుకు చాలా కష్టపడుతుంటారు. ఏది?ఎప్పుడు ఎలా సాధించాలనే విషయంలో క్లారిటీ మెయింటెన్(Maintain) చేస్తారు. ఆయనకు ఉన్నంత స్పష్టత ఎవ్వరిలో నేను చూడలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ కిచ్చా సుదీప్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Read More..

Pawan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story