- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
భయం గుప్పిట్లో విద్యార్థుల చదువులు..!
దిశ అలంపూర్ : బడిబాట పేరుతో పాఠశాలల్లో రూపురేఖలను మార్చేస్తున్నామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రాంతాల్లో నిధుల కొరతతో నిలిచిపోయాయి. కొన్ని పాఠశాలల పరిస్థితిని అధికారులు, ప్రజాపాలకులు ఊసే ఎత్తడం లేదు. దీంతో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మరికొన్ని పాఠశాల భవనాలు ఎప్పుడు కులుతాయో కూడా తెలియని విధంగా తయారయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల పరిస్థితి కూడా అదే విధంగా మారింది. ఈ పాఠశాలలో సుమారు 550 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. మీరు చదువుతున్న పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాల భవనాన్ని పదేళ్ల క్రితం నిర్మించారు. అయితే పట్టుమని పదేళ్లు గడవక ముందే శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన సందర్భాలు లేకపోలేదు.
తాజాగా గత 20 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గదులకు వర్షపు నీళ్లు రావడం, పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండడంతో భయభ్రాంతులకు విద్యార్థులకు గురవుతున్నారు. కనీసపు మరమ్మత్తులు కూడా చేపట్టడం లేదు. పాఠశాల భవనమే పూర్తిగా శిథిలమయ్యే పరిస్థితి నెలకొన్న ప్రజాపాలకులు జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మండల విద్యార్థులే కాక జిల్లా నలుమూలల నుంచి భారీగా విద్యార్థులు చదువుకోవడానికి ఈ ఉన్నత పాఠశాలలో చేరికలు జరిగాయి. ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ వసతి గృహాల్లో బసచేస్తూ చాలామంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు.
స్థానిక మండల ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వర్షం వస్తే ఒక్కొక్కసారి రోజు చేసే ప్రార్థన కూడా చేయలేని విధంగా ప్రాంగణం నీటితో నిండిపోతుందని, దీనికి తోడు పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం, బాత్రూం లకు వెళ్లాలంటే గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, టాయిలెట్ల దుస్థితిని గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి విద్యార్థులు విన్నవించుకున్నా సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల బిల్డింగ్ మరమ్మత్తులను వెను వెంటనే చేపట్టాలని, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
టాయిలెట్స్ లేక తెలిసిన వారి ఇండ్లకు వెళ్తున్నాము.. విద్యారాణి పదవ తరగతి
పాఠశాలలో సరైన టాయిలెట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నాం. ఎవరికి చెప్పకున్నా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో జిల్లా కలెక్టర్ నెల్లూరు క్రాంతికి వినతిపత్రం అందించాం. టాయిలెట్లకు తెలిసిన వారి ఇండ్లకు వెళ్లే పరిస్థితి నెలకొంది.
భయం భయం తో గదుల్లో చదువుకోలేక పోతున్నాం-
వైష్ణవి పదవతరగతి
పాఠశాల భవనం పెచ్చులు ఊడి ప్రతిరోజు మీద పడుతున్నాయి.
ప్రార్థన జరిగే సమయంలో కూడా సిమెంట్ పెచ్చులు పడి మా విద్యార్థులకు గాయాలైన సందర్భాలు లేకపోలేదు. భయం భయం తో చదువులు కొనసాగిస్తున్నాం. పెను ప్రమాదం జరగక ముందే భవనం మరమ్మత్తులు చేపట్టాలి.
ఎంఈఓ శివప్రసాద్ వివరణ. ..
పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయం వాస్తవమే. ప్రతి ఏడాది జిల్లా స్థాయి అధికారులకు విన్నవించుకుంటున్నాము. టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉందని కూడా తెలిపాం. నాలుగు లక్షల నిధులు కేటాయించిన పనులు ఇంకా జరగలేదు. నిధులు మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు. టాయిలెట్ల నిర్మాణం కూడా మధ్యలోనే ఆగింది. జిల్లా కలెక్టర్, డీఈవో దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాను.