- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
దిశ, గద్వాల కలెక్టరేట్ : యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాలులో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, వాటి దుష్ప్రభావాలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..డ్రగ్స్ నిర్మూలనకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వైపు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని ఆదేశించారు. పాఠశాలలో పేరెంట్, టీచర్ మీటింగ్‌లో డ్రగ్స్ నిర్మూలన గురించి చర్చించాలని సూచించారు. మారుమూల గ్రామాలు, బార్డర్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గంజాయి మొక్కలు కనిపిస్తే పోలీసు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ అధికారులు తనిఖీ చేయాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నేటి యువతపై తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, తప్పుడు దారులలో వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, డిడబ్లుఓ సునంద, ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి గణపతి రెడ్డి,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.