- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోగస్ ఓట్లు తొలగించేలా చర్యలు చేపట్టాలి.. మాజీ మంత్రి జూపల్లి
దిశ, వీపనగండ్ల : ఉమ్మడి వీపనగండ్ల చిన్నం బాయి మండలాలతో పాటు పానగల్ మండలంలోని పలుగ్రామాలలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బోగస్ ఓట్ల నమోదు చేయించారని వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బోగోస్ ఓట్ల పై తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు.
ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, గ్రామాలలో చనిపోయిన వ్యక్తులను ఓటర్ లిస్ట్ నుంచి వెంటనే తొలగించాలని, బోగస్ ఓటర్లను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీకాంత్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వీపనగండ్ల చిన్నంబాయి మండలల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోదల బీరయ్య, చంద్రశేఖర్ యాదవ్, నాయకులు రామచంద్రారెడ్డి, ఎత్తం కృష్ణయ్య, కళ్యాణ్ రావు, గోపి, రంజిత్, మహేష్, వెంకటయ్య తదితరులు ఉన్నారు.