పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించండి..

by Kalyani |
పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించండి..
X

దిశ, బిజినేపల్లి: మార్కండేయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలంటూ గంగారం గ్రామానికి చెందిన రైతులు మార్కండేయ ప్రాజెక్టుకు సంబంధించిన జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. సోమవారం రిజర్వాయర్ లో భాగంగా భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులు పనులు జరుగుతున్న సంఘటన స్థలానికి చేరుకొని తమ పొలాలలో పనులు చేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని అప్పటివరకు పనులు ఆపేయాలని ఆందోళన చేశారు.

పరిహారం కొరకు భూ నిర్వాసితులు పలుమార్లు అధికారులకు తెలిపిన కంపెనీ నిర్వాహకులు అవేమి పట్టించుకోకుండా యథేచ్చగా పనులు కొనసాగిస్తున్నారని రైతులు వాపోయారు. ముందుగా పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతనే తమ పొలాలలో మట్టిని తీయాలని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story