- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిశుధ్య లోపం.. పబ్బతి ఆంజనేయ స్వామికి శాపం
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు గ్రామం కృష్ణానది సమీపంలో వెలిసిన భక్తుల కొంగుబంగారంగా పిలువబడుతున్న శ్రీ పబ్బతి అంజనేయ స్వామి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పురుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.
ఏడాదికి రెండుసార్లు
శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి పేరుతో ఆంజనేయ మాలలను ప్రతి ఏడాదికి రెండు పర్యాయాలు భక్తులు మాలలు వేస్తూ వేల సంఖ్యలలో దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఏడాదికి రెండుసార్లు ఆంజనేయస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అలాగే ప్రతి శని ఆదివారాల్లో భక్తుల సంఖ్య స్వరాష్ట్రంతో పాటు పరుగు రాష్ట్రాల నుండి వచ్చి మొక్కులను చెల్లించుకుంటున్న నేపథ్యం నిత్యం కొనసాగుతుంది.
ఆలయానికి విరాళాలు
భక్తులు ఆలయాన్ని సంధించుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తుంటారు అలాగే ఆలయ హుండీ ద్వారా వస్తున్న ఆదాయం మరియు జాతర సందర్భాలలో టెండర్ వేసి లక్షలాది రూపాయలను ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారనే విమర్శలు భక్తుల నుండి ఎల్లువెత్తుతున్నాయి. జాతర సందర్భాలలో మాత్రమే పైపై పారిశుద్ధ పనులు చేపడుతూ ఆలయ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తూ ఏర్పాట్లపై పెదవి విరుస్తున్నారు.
అంతా బురదమయం
మద్దిమడుగు ఆంజనేయస్వామి ప్రాంగణంలో అంతా బురదమయం కావడంతో భక్తులు కాలు తీసి కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయిందని అలాగే ఎక్కడ పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో అస్తవ్యస్తంగా ఉందని చెప్పవచ్చును. ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని మాత్రమే చూసుకుంటున్న అధికారులు పారిశుధ్య పనులు చేపట్టడంలో అలసత్వం చూపడం వలన వారిపై భక్తులు మండిపడుతున్నారు. ఎటు చూసినా నీరు నిలవడం అంతా బురద మయంగా ఉండడంతో భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆలయ చుట్టుపక్కల తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read More...
Karimnagar: బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. బండి పాదయాత్ర మార్గంలోనే..