అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

by Kalyani |
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే వారికి మోక్షం లభించి,కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మందికి నమ్మకమని ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి అన్నారు.ఈ నెల 14 న పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం మహబూబ్ నగర్,షాద్ నగర్,నాగర్ కర్నూల్,నారాయణపేట డిపోల నుంచి అరుణాచలం కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు 13 వ తేదీన సాయంత్రం ఆయా బస్ స్టేషన్ల నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం విఘ్నేశ్వరుడు,వెల్లూరు లో శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం 14 వ తేదీ సాయంత్రం అరుణాచలం చేరుకొని,గిరి ప్రదక్షిణం అనంతరం 15 వ తేదీ మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై,మరుసటి రోజు ఆయా బస్ స్టేషన్ లకు చేరుకుంటాయని ఆమె వివరించారు.సీట్ల రిజర్వేషన్లు,ఛార్జీలు,సమయం,తదితర వివరాల కోసం మహబూబ్ నగర్ డిఎం ఫోన్ నెంబర్ 9959226286,షాద్ నగర్ 9959226287,నాగర్ కర్నూల్ 9959226288,నారాయణపేట 9959226293 డిఎం లకు సంప్రదించవచ్చని,ఆన్లైన్ రిజర్వేషన్ కోసం మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లోని రిజర్వేషన్ కౌంటర్లో కూడా తమ సీట్లను రిజర్వు చేసుకోవచ్చని ఆమె సూచించారు.

Advertisement

Next Story

Most Viewed