- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SP D.Janaki : జడ్చర్ల సిగ్నల్ గడ్డపై ట్రాఫిక్ సమస్య రాకుండా చూస్తాం
దిశ,జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదాలు,ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకీ తెలిపారు.మంగళవారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా, సిగ్నల్ గడ్డ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య గురించి స్థానిక పోలీసు అధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.సిగ్నల్ గడ్డ, అంబేద్కర్ చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ,దీని వల్ల ప్రజలు,ప్రయాణికులతో పాటు వాహానాల డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.దీనిపై సంబంధిత నేషనల్ హైవే అధికారులతో బుధవారం సమిక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని,దానికి సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ వస్తున్నట్లు తెలిపారు.
నిత్యం ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు స్థానికంగా ట్రాఫిక్ పోలీసులను నియమిస్తున్నామని అన్నారు.ఇదిలా ఉండగ ద్విచక్ర వాహనాల చోదకులు తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. దీనిపై త్వరలోనే అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.ఏడాది క్రితం ప్రారంభమైన జడ్చర్ల ,కోదాడ రోడ్డు పనులు నత్త నడక జరుగుతున్నట్లు పలువురు స్థానికులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ,తక్షణమే రోడ్ కాంట్రాక్టర్,నేషనల్ హైవే అధికారులను పిలిపించాలని సీఐ ఆదిరెడ్డిని ఆదేశించారు.