- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి ముసుగులో పల్లెల పై విషం..!
దిశ, ఎర్రవల్లి/ఇటిక్యాల : మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి జింకలపల్లి సమీపంలో అభివృద్ధి ముసుగులో ఓ కంపెనీ పల్లెల పై విషం చిమ్ముతోంది. ఎస్ఎంఎస్ కంపెనీ నుంచి కాలుష్యం వెదజల్లుతూ ప్రజలకు మూగజీవాలకు ప్రాణాంతకంగా మారిన ఎస్ఎంఎస్ కంపెనీని మూసివేయాలని ఇటిక్యాల ఎర్రవల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల పరిధిలోని జింకలపల్లె గ్రామశివారులో ఉపాధి కల్పిస్తామనే సాకుతో ఎస్ఎన్ఎస్ కంపెనీని గత 20 ఏండ్ల క్రితం స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ నుంచి వచ్చే విషవాయువు పీల్చుకోవడంతో సమీప గ్రామాలైన జింకల పల్లె, కొండేరు, ఎర్రవల్లి, షేకుపల్లె, సాసనులు, పుటాన్ దొడ్డి, తదితర గ్రామాల ప్రజలు రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. దానితో పాటు కంపెనీకి వెనక భాగం వైపు పంటపొలాల పైకి విషపు రసాయనాల నీటిని వదలడంతో ఆ రసాయనపు నీరు భూగర్భ జలాలను కలుషితం చేస్తూ పంట పొలాలు ఎండి పోతున్నాయి. సాయంత్రం, రాత్రి భరించలేనంత వాసన రావడంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
రోగాలతో సతమతం..
కంపెనీకి సమీప గ్రామమైన జింకలపల్లెలో ఒక బాలుడికి అంతుపట్టని రోగానికి గురై నేటికీ కోలుకోలేకుండా ఉన్నాడు. ఎస్ఎన్ఎస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గతంలో అనేక సార్లు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చినా, అవి నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఈ కంపెనీ యాజమాన్యం వెనుకు రాజకీయా అండదండలు ఉన్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కంపెనీ నుంచి బయటకు వచ్చే కలుషితమైన రసాయన చెరువు నీరుతాగి గేదెలు, చేపలు చనిపోయాయి. కంపెనీలో పనిచేసే వ్యక్తులు సైతం చనిపోయారు.
పర్యటనకు వచ్చిన కలెక్టర్ కు ఫిర్యాదు...
గతంలో కలెక్టర్ కొండేరు గ్రామానికి తనిఖీకి రాగా, జింకలపల్లి, కొండేరు, ఎర్రవల్లి తదితర గ్రామాల ప్రజలు ఎస్ఎన్ఎస్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. సమీపంలోని కంపెనీ నుంచి విషపూరితమైన విషయ వాయువులతో కూడిన పొగతో దుర్వాసన వస్తోందని, రకరకాలైన అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయని, కలుషితమైన గాలి రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ కంపెనీలో పనిచేస్తున్న బీహార్ వాసి ఆదివారం కంపెనీలోనే అనుమానాస్పదంగా మరణిస్తే కంపెనీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గద్వాల ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వారి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా, అధికారులు కంపెనీని మూసివేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.